ఆ రైల్వే స్టేషన్‌ దశ తిరిగింది.. ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్.. రూ.286.30 కోట్లతో

Date:

2027 గోదావరి పుష్కరాలకు రైల్వేశాఖ భారీ సన్నాహాలు చేస్తోంది. రాజమహేంద్రవరం స్టేషన్‌లో రూ.286.30 కోట్లతో కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు ఊపందుకున్నాయి. 1,012 ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు నడపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. భక్తుల రద్దీని తట్టుకునేలా బుకింగ్ కౌంటర్లు, ఎంక్వైరీ సెంటర్లు, ATVMలు ఏర్పాటు చేస్తున్నారు. 2027లో గోదావరి పుష్కరాల కంటే ముందే పనులు పూర్తి చేయాలని లక్ష్యం

  • గోదావరి పుష్కరాలకు కసరత్తు
  • రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు
  • రూ.286.30 కోట్లతో కొత్త నిర్మాణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రైల్వేశాఖ భారీ సన్నాహాలు చేస్తోంది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.286.30 కోట్లతో కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు ఊపందుకున్నాయి. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లతో పాటు మూడు అదనపు ఫుట్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ప్లాట్‌ఫామ్‌లపై షెల్టర్లను విస్తరిస్తారు. స్టేషన్‌కు తూర్పు వైపు కొత్త భవనంతో రెండో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...