ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

Date:

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌‌కు రైతులు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే అమరావతి నిర్మాణం ఆలస్యం అయిందని తెలిపారు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని.. మంత్రి నారాయణ వెల్లడించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాల మేరకు అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యాన్ని వివరించారు.

ఈ క్రమంలోనే అమరావతిని గ్లోబల్ రాజధానిగా తీర్చిదిద్దడంలో భాగంగా.. స్మార్ట్ ఇండస్ట్రీలు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ విడతలో రైతులు అందించే 7 వేలకు పైగా ఎకరాల భూముల్లో.. సుమారు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...