
కర్నూలు బస్సు అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 19 మృతదేహాలను వెలికితీశారు. మరి కొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే హైదరాబాద్‌లో బస్సు ఎక్కిన ముగ్గురి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. వారు ఏమయ్యారనే ఆందోళన నెలకొంది. కాగా, బైక్‌ను ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.
ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.


