నిరుద్యోగ యువతకు శుభవార్త.. కాగ్నిజెంట్ SEZతో భారీగా ఉపాధి అవకాశాలు

Date:

ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మక SEZ ప్రాజెక్ట్ ఖరారైంది. వైజాగ్ ఐటీ కారిడార్‌గా పేరొందిన మధురవాడలో ఇప్పటికే ఏర్పాటైన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) ఏర్పాటుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీ విస్తరణ మరింత వేగవంతం కానుంది..

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్ పరిధిలోని హిల్ నెం.2 లో ఈ కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు అయింది. గతంలోనే ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు జరగగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక అనుమతులతో అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.

ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు ప్రముఖ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తుండగా, ఇప్పుడు కాగ్నిజెంట్ రాకతో మధురవాడ రూపురేఖలు మరింత మారనున్నాయి.

వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు

ఈ సరికొత్త ఐటీ సెజ్ అందుబాటులోకి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణులకు, ఫ్రెషర్స్‌కు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

స్థానికంగానే అంతర్జాతీయ స్థాయి కంపెనీలో పనిచేసే అవకాశం దక్కడం వల్ల బ్రెయిన్ డ్రెయిన్ అంటే ప్రతిభావంతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం తగ్గుతుందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...