పాత ప్లేయర్లను వెనక్కి తెచ్చుకునే ప్లాన్‌లో ముంబై.. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో చర్చలు

Date:

ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకుంటోంది. లక్నో నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను తీసుకుంటున్న వార్తలు వచ్చిన తర్వాత, ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తిరిగి జట్టులోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. గతంలో ముంబై తరఫున ఆడిన మార్కండే, కేకేఆర్‌లో ఆడే అవకాశం దక్కలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి రాహుల్ చహార్‌ను కూడా తిరిగి తీసుకురావాలని ముంబై యోచిస్తోంది

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తమ తమ జట్లను స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ట్రేడ్ విండోలో బిజీగా మారింది. తమ పాత టాలెంటెడ్ ప్లేయర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్లని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయింది. ఇప్పటికే ఇప్పటికే శార్ధూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకున్న ముంబై జట్టు, ఇప్పుడు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో కొలకతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...