బంగారం ధరల షాక్.. ఒక్కరోజులోనే రూ.3,770 పెరుగుదల, వెండి కూడా భారీ జంప్!

Date:

బంగారం మళ్లీ భగ్గుమంది.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల, వెండి కూడా పరుగులు

గత రెండు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రెండు రోజుల్లో ఎంత మేర తగ్గాయో, దాదాపు అంతే స్థాయిలో నేడు ఒక్కరోజులోనే పెరగడంతో పసిడి ప్రియులు నిరాశకు గురయ్యారు. ఈరోజు తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.3,770 పెరగగా, కిలో వెండి ధర రూ.5,000 ఎగబాకింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.14,455గా నమోదైంది. 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.13,250గా, 18 క్యారెట్ల (75 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.10,841గా ఉంది.

అదే విధంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500 వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,700గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650గా కొనసాగుతోంది.

ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,50,000కు చేరుకోగా, ఢిల్లీలో కిలో వెండి ధర కూడా రూ.5,000 పెరిగి రూ.2,45,000 వద్ద విక్రయమవుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...