విశాఖవాసులకు ఆర్టీసీ బంపరాఫర్.. కేవలం రూ.100 మాత్రమే, ఇకపై 24 గంటలు

Date:

విశాఖపట్నం వాసులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త. రూ.100తో ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ టికెట్ కొంటే 24 గంటల పాటు నగరంలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. గతంలో రాత్రి 12 గంటలకు ముగిసే గడువును సడలించారు. ఈ సౌకర్యం నగరంలోని అన్ని ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. ప్రయాణికుల వివరాలు కండక్టర్‌కు అందించాలి. డబుల్ డెక్కర్ బస్సుల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి

విశాఖపట్నంవాసులకు ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఇకపై రూ.100తో ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ టికెట్ కొనుగోలు చేస్తే.. నగర పరిధిలో 24 గంటల పాటు ఎన్నిసార్లు, ఎన్ని బస్సులు మారైనా ప్రయాణించవచ్చు. మధురవాడ డిపో మేనేజర్ ఈ విషయాన్ని తెలియజేశారు. గతంలో ఈ గడువు రాత్రి 12 గంటలకే ముగిసేది.. రాత్రి 11 గంటలకు టికెట్ తీసుకుంటే, కేవలం ఒక గంట మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఈ సమయాన్ని సడలించారు.. ఉదాహరణకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టికెట్ తీసుకుంటే.. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ సౌకర్యం నగర పరిధిలో తిరిగే అన్ని ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనతో తరచుగా బస్సుల్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది ప్రయాణికుల ఖర్చును తగ్గించడమే కాకుండా, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...