సరదాకేమో అనుకున్నా, అస్సలు ఊహించలేదు.. టాలీవుడ్ నటిపై ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్

Date:

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటింది! ఇటీవల జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఆమెను అభినందిస్తూ, చీరకట్టులో పవర్ లిఫ్టింగ్ చేయడం చూసి మొదట సరదా అనుకున్నానని, కానీ ఆమె నిబద్ధత చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. ట్రోలింగ్‌పై స్పందిస్తూ, తన విజయాలతోనే సమాధానం చెప్పానని ప్రగతి పేర్కొంది

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి సినిమాల్లో మాత్రమే కాదు.. పవర్ లిఫ్టింగ్‌లో కూడా అదరగొడుతున్నారు. ఇటీవల జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు. ఓవరాల్‌గా సిల్వర్‌ మెడల్‌, డెడ్‌ లిఫ్ట్‌నకు గోల్డ్‌ మెడల్‌, బెంచ్‌, స్క్వాట్‌ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్‌ మెడల్స్‌ వచ్చాయి. ప్రగతిపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించడంపై ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించారు.. ఆమెను అభినందించారు. ప్రగతి పవర్ లిఫ్టింగ్ చేస్తుంటే సరదాగా అనుకున్నానని.. కానీ ఇలా స్పోర్ట్స్‌లో కూడా రాణిస్తూ పతకాలు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...