
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇండ్లు నిర్మించుకోవాలనుకుంటున్న పట్టణ లబ్ధిదారులకు శుభవార్త. స్థల పరిమితులు, నిబంధనల కారణంగా నిలిచిపోయిన నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం జీ+1 నిర్మాణానికి అనుమతిని సడలించింది. చిన్న స్థలాల్లోనూ రెండు అంతస్తుల వరకు ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో సొంత ఇంటి కల నెరవేరనుందని పేదలు ఆశిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కింద పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో నిర్మాణాలకు ఆశించిన పురోగతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ నిబంధనలను సడలించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అనుగుణంగా లేకపోవడం లేదా ఇరుకుగా ఉండటం వల్ల చాలా మంది లబ్ధిదారులు నిర్మాణం చేపట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు
