
- ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త బైపాస్ రోడ్‌ను నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపనుంది అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకుంటున్న నేపథ్యంలో విజయవాడ పశ్చిమ బైపాస్ సమీపంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి పుంజుకుంటోంది.
- ఇన్ని రోజులు రాజధానిపై అనిశ్చితి కారణంగా పాయకపురం, జక్కంపూడి, పాతపాడు, గుణదల వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది ఇప్పుడ అమరావతి నిర్మా్ణం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలు ప్రధాన పెట్టుబడి గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.
- విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాంతంలో పదికి పైగా కొత్త వెంచర్లు ప్రారంభం కానున్నట్లు తెలిసింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత నెలకొంది.
- 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. అయితే, విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం పూర్తి కావడం, అమరావతి పనులు తిరిగి ప్రారంభం కానుండటంతో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది.


