CSK vs RR: రాజస్థాన్‌తో ధోనీ లేకుండానే బరిలోకి.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?

Date:

Chennai Super Kings Playing XI: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం అందబోతోంది. గౌహతి వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గత సీజన్‌లో ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి, భారీ మార్పులు, సంచలన ట్రేడింగ్‌ల తర్వాత ఇరు జట్లు ఈ మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఈ పోరు హోరాహోరీగా సాగనుంది.

IPL 2026, CSK vs RR: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ డీల్స్ అనంతరం చెన్నై, రాజస్థాన్ జట్లు ముఖాముఖి అవ్వడం విశేషం. సంజూ శాంసన్‌ను చెన్నై తమ జట్టులోకి తీసుకోగా, రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు రాజస్థాన్ తరఫున ఆడనున్నారు. సోమవారం జరిగే ఈ మ్యాచ్‌లో ట్రేడ్ అయిన కీలక ఆటగాళ్లు అందరూ బరిలోకి దిగే అవకాశం ఉండటంతో మ్యాచ్‌పై అంచనాలు మరింత పెరిగాయి. గత సీజన్‌లో దిగువ స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లు, ఈసారి విజయంతో ఆరంభం చేయాలని పట్టుదలగా ఉన్నాయి.

మహేంద్ర సింగ్ ధోనీ దూరం.. సీఎస్కేకు పెద్ద షాక్..
సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. గాయం కారణంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తొలి రెండు వారాల పాటు టోర్నీకి దూరమయ్యాడు. అలాగే పేసర్ నాథన్ ఎల్లిస్ కూడా అందుబాటులో లేకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ధోనీ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో దూరమవ్వడంతో ఆస్ట్రేలియా బ్యాటర్ మాట్ షార్ట్‌కు అవకాశం లభించనుంది.

బలమైన బ్యాటింగ్ ఆర్డర్.. ఓపెనర్లుగా రుతురాజ్, సంజూ
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో సంజూ శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. సంజూ దూకుడైన ఆటతో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత వహిస్తే, రుతురాజ్ స్థిరంగా ఇన్నింగ్స్‌ను నడిపించే పాత్రలో ఉంటాడు. మూడో స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ మ్హత్రే బ్యాటింగ్‌కు రానున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే తన పవర్ హిట్టింగ్‌తో పాటు అవసరమైతే బౌలింగ్‌లోనూ కీలకంగా మారనున్నాడు.

భారీ ధరకు కొన్న యువ ఆటగాళ్లపై ఆశలు..
వేలంలో చెన్నై జట్టు ఒక్కొక్కరికి 14.2 కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకున్న కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఈ మ్యాచ్‌లో ఫినిషర్లుగా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ధోనీ లేని లోటును వీరు భర్తీ చేస్తారని జట్టు యాజమాన్యం నమ్మకం వ్యక్తం చేస్తోంది. బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ పేస్ బాధ్యతలు తీసుకోనుండగా, స్పిన్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ నూర్ అహ్మద్ ప్రధాన ఆయుధంగా మారనున్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో తలపడే చెన్నై సూపర్ కింగ్స్ అంచనా జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మ్హత్రే, మాట్ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....