ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి ఎదిరించిన తాత చివరకు ఏం జరిగిందంటే..

0
19

పుణె జిల్లా పింపర్‌ఖేడ్‌ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ కుటుంబానికి చెందిన పొలంలో పనిచేస్తున్న తాత వద్దకు తాగునీరు తీసుకెళుతున్న ఐదేళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.