Telangana News: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. కొత్త కార్యక్రమానికి శ్రీకారం.

Date:

తెలంగాణలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. గ్రామాల్లోని మహిళలను ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను అప్పగించనుంది. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రణాళికలు రచిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించనుంది. రైతులకు ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా ఉన్న మహిళా సంఘాలను గుర్తించనుంది

వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. రాష్ట్రంలో దాదాపు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని ఎంపిక చేసిన లైసెన్స్ అందించనున్నారు. అలాగే వీరికి యూరియా యాప్ వినియోగంపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కోసం 8,126 సొంత భవనాలను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ కేంద్రాల్లోనే ఎరువులు నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...