
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ను ఉండవల్లి నివాసంలో కలిశారు. అజయ్ బాబుతో పాటు 2010 ఢిల్లీ కామన్వెల్త్ పోటీల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న ఆయన తండ్రి కూడా లోకేశ్‌ను కలవడం విశేషం. రానున్న ఒలింపిక్స్ లక్ష్యంగా కష్టపడాలంటూ లోకేశ్ అజయ్ బాబుకు చెప్పారు. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు.
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్‌తో అజయ్ బాబు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అజయ్ బాబును నారా లోకేశ్ అభినందించారు. రజత పతకం సాధించడం మన రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణం అని కొనియాడారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు 79 కిలోల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తండ్రి కాంస్య పతకం సాధించగా.. కుమారుడు 16 ఏళ్ల తర్వాత రజత పతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా లోకేశ్ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని లోకేశ్ ఆకాంక్షించారు. ప్రభుత్వం అజయ్ బాబుకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంత్రి లోకేశ్‌ను కలిసేందుకు అజయ్ బాబు తన కుటుంబంతో సహా హాజరయ్యారు. 2010లో ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న ఆయన తండ్రి కూడా లోకేశ్‌తో మాట్లాడారు. అనంతరం అజయ్ బాబును మంత్రి లోకేశ్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. రానున్న ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని భరోసా ఇచ్చారు.
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో 22 ఏళ్ల వల్లూరి అజయ్ బాబు రజత పతకాన్ని అందుకున్నాడు. కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు. 79 కిలోల విభాగంలో బరిలోకి దిగిన అజయ్ బాబు మొత్తం 330 కిలోల బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 181 కిలోల బరువు ఎత్తాడు. అజయ్ బాబు స్వగ్రామమైన విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామం నుంచి ఇప్పటి వరకు 33 మంది వెయిట్‌లిఫ్టర్లు దేశానికి పతకాలు తేవడం విశేషం.

