Home Blog

ఏపీలో మరో కొత్త వాలంటీర్ వ్యవస్థ.. 30 వేలమందికి అవకాశం

0
ఏపీలో మరో కొత్త వాలంటీర్ వ్యవస్థ.. 30 వేలమందికి అవకాశం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు మరణాలను నివారించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పాములను బంధించడం, పాముకాటుకు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వీరి పని. హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది ఏపీ అటవీ శాఖ. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది సర్పమిత్రలను నియమించనుంది. వీరికి ప్రోత్సాహకాలు కూడా అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించారు.

లోన్ తీసుకున్నవారికి బ్యాంక్ శుభవార్త.. తగ్గనున్న EMIలు.. నేటి నుంచే అమలులోకి

0
లోన్ తీసుకున్నవారికి బ్యాంక్ శుభవార్త.. తగ్గనున్న EMIలు.. నేటి నుంచే అమలులోకి

ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి అదిరే శుభవార్త. వివిధ రుణాలకు సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను ఈ ప్రభుత్వ బ్యాంక్ తగ్గించింది. అన్ని టెన్యూర్లపై 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు తెలిపింది. నవంబర్ 12, 2025 నుంచే సవరించిన వడ్డీ రేట్లను అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. దీంతో లోన్ ఈఎంఐలు ఒక్కసారిగా దిగిరానున్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి.

దేశంలోని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ ( Canara Bank ) తమ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. రుణాల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రుణాలకు లింక్ అయి ఉండే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) అన్ని టెన్యూర్ల రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్లోటింగ్ రేట్ వడ్డీతో పర్సనల్ లోన్, ఆటో లోన్, హోమ్ లోన్ తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ ( EMI)ల భారం తగ్గనుంది. ఇక సవరించిన.

నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

0
Minister Surekha
Minister Surekha

నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు.

హైదరాబాద్, నవంబరు12 నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం (Akkineni Nagarjuna Family) మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సురేఖ మరోసారి స్పందించారు.

ఈ క్రమంలో ఆమె నిన్న(మంగళవారం) అర్థరాత్రి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. నాగార్జున కుటుంబం మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని తేల్చిచెప్పారు మంత్రి కొండా సురేఖ.

ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు రేపు(గురువారం) నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ చేయనుంది నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ విచారణకు ఒక రోజు ముందుగా నాగార్జునను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ఈ పోస్ట్ పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

“ఆకట్టుకోబడిన సమాజపు భాగంగా ఉన్న ట్రాన్స్‌జెండర్లు: 6 నేలల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి కోసం రిజర్వేషన్‌ను కల్పించాలంటూ AP High Court ఉత్తర్వు”

0
transgender reservation
transgender reservation

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: ట్రాన్స్‌జెండర్‌లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ట్రాన్స్‌జెండర్‌ల కోసం సానుకూల చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక బాధ్యత అని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా ఆదేశించింది.

న్యాయమూర్తి న్యాపతి విజయ్ గారు ఈ ఆదేశాన్ని జారీ చేస్తూ వ్యాఖ్యానించారు:
“ట్రాన్స్‌జెండర్ సమాజం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినదే కాకుండా, సమాజం చేత విడిచిపెట్టబడింది కూడా. ఈ పరిస్థితుల్లో, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ఇలాంటి వర్గాల కోసం సానుకూల చర్యలు తీసుకోవడం నైతిక బాధ్యతగా ఉంటుంది.”

ఈ ఆదేశం ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇవ్వబడింది. ఆమె “స్కూల్ అసిస్టెంట్ (భాష) హిందీ” మరియు “టీజీటీ (భాష) హిందీ” పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించి ఖాళీలను ప్రకటించకపోవడంతో తాను పరిగణనలోకి రాలేదని పిటిషన్‌లో తెలిపింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

0
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని, పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య జూబ్లీహిల్స్‌లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ డ్రోన్ల ద్వారా పోలింగ్‌ పరిస్థితిని పర్యవేక్షించారు. దేశంలోనే తొలిసారి 150 డ్రోన్‌ కెమెరాలతో పోలింగ్‌ కేంద్రాల భద్రతను పరిశీలిస్తున్నామని తెలిపారు. మొత్తం పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని సీపీ పేర్కొన్నారు

“రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానం గా మార్చడానికి చర్యలు – కందుల దుర్ఘేష్”

0
Tourism growth in AP
Tourism growth in AP

పర్యాటకం, సాంస్కృతికం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గత 16 నెలల పాలనలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచేందుకు పలు మార్పులు, సృజనాత్మక చర్యలను చేపట్టిందని చెప్పారు.

విజయవాడలో సోమవారం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య (APCCIF) ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక రంగ ప్రతినిధుల సమావేశంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం–ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయం పర్యాటక అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలకమని అన్నారు. పర్యాటక రంగ వేగవంతమైన అభివృద్ధి కోసం సవరణలతో కూడిన కొత్త పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

“పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం వల్ల మరిన్ని పెట్టుబడులు ఆకర్షించబడతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పర్యాటకుల అనుభవం మరింత మెరుగుపడుతుంది,” అని మంత్రి తెలిపారు.

అదనంగా, భూమి కేటాయింపు, కారవాన్ పర్యాటకం, హోమ్-స్టే విధానాల వంటి అనుబంధ చర్యలను కూడా ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) చైర్మన్ డాక్టర్ నుకసాని బాలాజీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

రేషన్ కార్డుదారులకు షాక్.. ఈ నెల 30 వరకే ఛాన్స్, ఆ తర్వాత కష్టమే

0
రేషన్ కార్డుదారులకు షాక్.. ఈ నెల 30 వరకే ఛాన్స్, ఆ తర్వాత కష్టమే

రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు, ముఖ్యంగా వలస వెళ్లినవాళ్లు ఇంకా కార్డులు తీసుకోలేదు. అనకాపల్లి మండలంలోనే వేలాది కార్డులు మిగిలిపోయాయి. ఈ నెల 30 లోపు కార్డులు తీసుకోకపోతే అవి రద్దు అవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ప్రతి ఐదేళ్లకోసారి ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేదంటే పథకాలు ఆగిపోతాయని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త స్మార్ట్ కార్డులను మూడు నెలల క్రితం జారీ చేసింది. గ్రామ సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ల పర్యవేక్షణలో ఈ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే మూడు నెలలు గడిచినా వేలాది కార్డులను లబ్ధిదారుల తీసుకోలేదు. ప్రధానంగా వలస వెళ్లిన లబ్ధిదారులకు కార్డులు తీసుకోవడం కష్టంగా మారింది. అలాగే మరికొందరు కూడా కార్డులు తీసుకోలేదు. దీనివల్ల వేలాది కార్డులు ఇంకా పంపిణీ కాకుండానే ఉండిపోయాయి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త – రూ. 750 కోట్ల యోగా సెంటర్‌కు ఆమోదం

0
Mega yoga centre in AP
Mega yoga centre in AP

సంప్రదాయ వైద్య రంగానికి మరో ముఖ్యమైన మైలురాయిగా, కేంద్ర ప్రభుత్వం దేశంలోని తొలి అపెక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించడానికి రూ. 750 కోట్ల పెట్టుబడితో ఆమోదం తెలిపింది.

ఆరోగ్య మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ సంస్థను ఎయిమ్స్ (AIIMS) తరహాలో అభివృద్ధి చేసి, ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి ఆధ్వర్యంలో నడపబడుతుందని చెప్పారు.

ఈ సంస్థను 40 ఎకరాల భూమిపై నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి ఏర్పాటు చేసి, వివిధ ప్రకృతి వైద్య సేవలను అందించనున్నారు.

అకాడమిక్‌గా, ఈ సంస్థలో బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సర్జరీ (BNYS) కోర్సులో 100 అండర్‌గ్రాడ్యుయేట్ సీట్లు మరియు ప్రత్యేక విభాగాల్లో 20 పీజీ సీట్లు ఉంటాయి. అలాగే ప్రత్యేక రీసెర్చ్ మరియు ట్రైనింగ్ సెంటర్ కూడా ఈ క్యాంపస్‌లో భాగంగా ఉంటుంది.

అదనంగా, గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు మండలం, నడింపలంలో ఉన్న కాటూరు మెడికల్ కాలేజ్ సమీపంలో మరో సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిను రూ. 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది.

ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12.96 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కేంద్రం పూర్తిగా వైద్య సేవలపైనే దృష్టి సారించనుంది మరియు దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

హమ్మయ్య ఇక నో టెన్షన్.. ఇందిరమ్మ ఇళ్ల నిబంధనల సడలింపు

0
హమ్మయ్య ఇక నో టెన్షన్.. ఇందిరమ్మ ఇళ్ల నిబంధనల సడలింపు

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇండ్లు నిర్మించుకోవాలనుకుంటున్న పట్టణ లబ్ధిదారులకు శుభవార్త. స్థల పరిమితులు, నిబంధనల కారణంగా నిలిచిపోయిన నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం జీ+1 నిర్మాణానికి అనుమతిని సడలించింది. చిన్న స్థలాల్లోనూ రెండు అంతస్తుల వరకు ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో సొంత ఇంటి కల నెరవేరనుందని పేదలు ఆశిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కింద పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో నిర్మాణాలకు ఆశించిన పురోగతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ నిబంధనలను సడలించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో  అనుగుణంగా లేకపోవడం లేదా ఇరుకుగా ఉండటం వల్ల చాలా మంది లబ్ధిదారులు నిర్మాణం చేపట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు

ఏపీలో పాఠశాలలకు మహర్దశ.. ‘లీప్‌’ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలు.. కార్పొరేట్‌ కంటే మెరుగ్గా

0
ఏపీలో పాఠశాలలకు మహర్దశ.. 'లీప్‌' స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలు.. కార్పొరేట్‌ కంటే మెరుగ్గా

ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో నూతన మార్పులు తెస్తున్నారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. ప్రత్యేక డిజైన్‌, ప్రపంచ స్థాయి వసతులతో పాఠశాలలు ఏర్పాటు చేయడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలో పైలట్ ప్రాజెక్టు కోసం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జడ్‌పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం నిడమర్రు పాఠశాల పనులు శరవేగంగా సాగుతున్నాయి