ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సోమవారం బాధిత బాలిక కుటుంబాన్ని రాయపాటి శైలజ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

చిన్నారి మృతికి కారణమైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

చిన్నారిపై జరిగిన ఈ అమానవీయ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు చట్టప్రకారం శిక్ష పడేలా చూడాల్సిన అవసరం ఉందని రాయపాటి శైలజ పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *