తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు డీజీపీలు ఐజీపీల జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారించింది.

సదస్సు నిర్వహణకు సంబంధించి సోమవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధ్యక్షతన అంతర్‌శాఖల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ప్రధానమంత్రి పాల్గొనే ఈ జాతీయ స్థాయి సమావేశానికి సంబంధించి ఎలాంటి లోపాలకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. భద్రత, రవాణా, వసతులు, ఇతర అవసరమైన ఏర్పాట్ల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.

సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *