బోణీ కొట్టాలని కోల్‌కతా పోరాటం.. హ్యాట్రిక్ నమోదు చేయాలని పంజాబ్ ఆరాటం!

Date:

ఐపీఎల్ 2026లో భాగంగా 12వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ – పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో కేకేఆర్ 21, పంజాబ్ 13 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ రోజు మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని కేకేఆర్ చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు

ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ గతే మారిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2025లో అడుగుపెట్టి పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాదయినా కమ్ బ్యాక్ ఇస్తుంది అనుకుంటే ఇప్పుడు కూడా అదే స్థాయి ఆటతీరు కనబరుస్తోంది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ రెండింటిలోనూ ఓటమిపాలయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన ఓడిన కేకేఆర్, రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ భారీ టార్గెట్ రీచ్ కాలేక పరాజయం పాలయింది. దాంతో మూడో మ్యాచ్‌లో గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...