ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను ప్రముఖ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం కలిశారు. జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణ పతకం సాధించిన సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు.
ఏషియన్ గేమ్స్-2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన జ్యోతి సురేఖ ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని మంత్రి లోకేశ్ ప్రశంసించారు.
జ్యోతి సురేఖ తండ్రి సురేంద్ర కుమార్ కూడా సోమవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఇప్పటివరకు ఏషియన్ గేమ్స్‌లో సురేఖ నాలుగు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం ఆరు పతకాలు సాధించినట్లు తెలిపారు.
జ్యోతి సురేఖ 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఆమె లక్ష్య సాధనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.