ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్.. కింగ్ కోహ్లీ వచ్చేస్తున్నాడు..!

Date:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఫుల్ కుషీ అయ్యే వీడియోను ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశాడు. ఈనెల చివర్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా.. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఐపీఎల్ 2026.. అని దానికి క్యాప్షన్ ఇచ్చాడు. లండన్‌లోని లార్డ్స్‌లో కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు.

ఐపీఎల్ 2026 మరో 17 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న టోర్నీకి తెరలేవనుంది. ఇక మార్చి 12న ఐపీఎల్ 2026కు సంబంధించిన తొలి 20 రోజుల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇదివరకే వెల్లడించారు. ఇక ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. దాదాపుగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు తలపడే అవకాశం ఉంది.

అయితే ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ .. ఐపీఎల్ 19వ సీజన్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. ప్రస్తుతం కుటుంబంతో పాటు లండన్‌లో ఉంటున్న విరాట్ కోహ్లీ.. లార్డ్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో అతడు పోస్టు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

లండన్‍‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లోని ఇండోర్ ఫెసిలిటీలో కింగ్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 కోసం అతడు సాధన ప్రారంభించాడు. ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఐపీఎల్ 2026’ అని క్యాప్షన్ ఇచ్చాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...