ఆరోజు కేఎల్ రాహుల్‌లో మొదటిసారి కోపం చూశా: వసీం జాఫర్

Date:

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశాంతమైన స్వభావం గురించి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో కేఎల్ రాహుల్ తీవ్ర నిరాశకు, కోపానికి గురవ్వడం చూశానని చెప్పాడు. గెలవాల్సిన మ్యాచ్‌లు చివరి ఓవర్లలో చేజారినప్పుడు రాహుల్ ముఖంలో తీవ్ర అసహనం కనిపించిందని పేర్కొన్నాడు. ప్రశాంతంగా ఉండే రాహుల్‌లో అంత కోపాన్ని చూడటం అదే తొలిసారని జాఫర్ వెల్లడించాడు.

భారత జట్టు వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో కేఎల్ రాహుల్, వసీం జాఫర్.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కోసం కలిసి పనిచేశారు. అప్పుడు రాహుల్ ఆ జట్టుకు కెప్టెన్‌గా, జాఫర్ కోచ్‌గా ఉన్నారు. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే.. కేఎల్ రాహుల్‌లో తాను ఒక్కసారి కోపం చూశానని జాఫర్ వ్యాఖ్యానించాడు. అందుకు గల కారణాన్ని, సందర్భాన్ని సైతం వివరించాడు.

ఐపీఎల్‌లో రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇది జరిగిందని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లలో ఓడిపోవడం రాహుల్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపాడు.

“కేఎల్ రాహుల్ సహజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలోనూ, బయటా ఎక్కువగా కోపం చూపించడం చాలా అరుదు. కానీ నేను పంజాబ్ కింగ్స్‌లో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో తొలిసారి అతడిలో కోపం చూశా. గెలవాల్సిన మ్యాచ్‌లను చివరి ఓవర్లలో కోల్పోయాం. ఇలాగే ఒక మ్యాచ్ ఓడిన తర్వాత అతడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. అయినప్పటికీ అతడు హద్దులు దాటి ఏమీ మాట్లాడలేదు. కానీ జట్టు ఆటతీరుపై ఎంత నిరాశ చెందాడో అతడి ముఖంలో, మాటల ద్వారా అర్థమైంది. నేను కేఎల్ రాహుల్‌ను కోపంగా చూసిన ఏకైక సందర్భం అదే” అని వసీం జాఫర్ వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...