టెన్త్ టు పీజీ వరకు చదివారా.. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.. రెడీగా ఉండండి

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ‘కౌశలం’ సర్వే ద్వారా పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించనుంది. సచివాలయాల్లోనే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించి, అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వెబ్‌ కెమెరాలు, హెడ్‌ ఫోన్లు సిద్ధం చేశారు. త్వరలోనే ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘కౌశలం’ పేరుతో సర్వే నిర్వహించింది. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారి వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానంలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా, ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన వెబ్‌ కెమెరాలు, హెడ్‌ ఫోన్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సచివాలయంలో ఇద్దరు సిబ్బందికి ఆన్‌లైన్ నమూనా పరీక్షలు నిర్వహించి, వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు వారి ఫోన్ నంబర్లకు లేదా ఈ-మెయిల్ ఐడీలకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని పంపనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...