రేయ్.. ఏంట్రా ఇలా ఉన్నారు.. బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..

Date:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఫేక్ ఫోన్‌పే స్క్రీన్‌షాట్ చూపించి రూ.97 వేల విలువైన బంగారు ఉంగరం, లాకెట్‌తో ఓ కేటుగాడు పరారయ్యాడు. నగలు కొనుగోలు చేసినట్లు నమ్మించి యూపీఐ చెల్లింపు జరిగినట్టుగా చూపించిన నిందితుడు, డబ్బులు ఖాతాలో జమ కాకముందే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫేక్ ఫోన్ ఫే స్క్రీన్ షాట్‌తో డబ్బులు చెల్లించినట్లుగా చూపించి బంగారు ఆభరణాలతో నిందితుడు జంప్ అయ్యాడు.. ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో చోటుచేసుకుంది. ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి ఓ కేటుగాడు బంగారు నగలు కాజేయడం సంచలనంగా మారింది. చేతన్ జ్యువెలరీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని చేతన్ జ్యువెలరీకి వచ్చిన ఓ వ్యక్తి ఉంగరం, లాకెట్ చూపించాలన్నారు.. అనంతరం పరిశీలించిన.. వాటిని ఎంపిక చేసుకున్నాడు.

అనంతరం మొత్తం రూ.1.05 లక్షలు అవుతాయని చెప్పగా బేరం ఆడి రూ.97 వేలకు ఒప్పించాడు. ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానంటూ బిల్లు రాయించుకున్న అతడు, ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి డబ్బులు పంపినట్లు నమ్మించాడు. నగలు దుకాణంలో ఇతర కస్టమర్స్ ఉండటంతో వారితో బిజీగా ఉన్న షాపు యాజమాని ..ఆ తర్వాత అకౌంట్ చెక్ చేయగా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ఖాతాలో నగదు జమ కాలేదని దుకాణ యజమానురాలు చెప్పేలోపే బంగారు నగలతో ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. యజమానురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు కొత్తగూడెం వైపు తప్పించుకున్నట్లు స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు నిందితుడు మండలంలోని పలువురు బంగారు దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు కూడా సీసీ కెమెరాల్లో నమోదైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...