
SonyLIVలో ‘చెన్నై లవ్ స్టోరీ’
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఆగస్టు 21 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
స్టీవెన్, నివిల జీవితాల చుట్టూ ఈ కథ సాగుతుంది. ప్రేమ, భావోద్వేగాలు, వ్యక్తిగత లక్ష్యాలు, విధి కారణంగా వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించారు. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై SKN, సాయి రాజేష్ నిర్మించారు.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియతో పాటు త్రిగుణ్, దేవి ప్రసాద్, దీపా శంకర్, దర్శకుడు పి. వాసు కీలక పాత్రల్లో నటించారు.
ZEE5లో ‘జన నాయగన్’
దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం ‘జన నాయగన్’ కూడా ఆగస్టు 21 నుంచే ZEE5లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Netflixలో ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’
మరోవైపు వివాహం, దాని తర్వాత జీవితంలో ఎదురయ్యే బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ కూడా ఆగస్టు 21 నుంచి Netflixలో అందుబాటులోకి వచ్చింది.
ఎలన్, సాన్వి మేఘన, రాధికా శరత్‌కుమార్, ఎం.ఎస్. భాస్కర్, యోగి బాబు తదితరులు నటించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒకే రోజు మూడు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు ఓటీటీలోకి రావడంతో ఈ వీకెండ్ సినీ ప్రియులకు మంచి వినోదం లభించనుంది.

