
ఈ ఏడాది క్రిస్మస్ సీజన్‌లో టాలీవుడ్ నుంచి పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సీనియర్ స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ కూడా ఎన్నో ఏళ్ల తర్వాత ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలవనున్నారు. ‘కింగ్ 100’, ‘దాదా’ చిత్రాలు డిసెంబర్ 24న విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఒకేరోజు ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో క్రిస్మస్ సీజన్‌పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ రేసులోకి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయారు.
దర్శకుడిగా కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు హీరోగా, రచయితగా, నిర్మాతగా తన ప్రతిభను చూపించిన ఆయన.. ఈ చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు.
షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా చిత్రబృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది.
డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
‘రియాలిటీ’ సినిమాను 2026 డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో నాగార్జున, బాలకృష్ణ సినిమాలతో పాటు కిరణ్ అబ్బవరం చిత్రం కూడా క్రిస్మస్ బాక్సాఫీస్ రేసులో నిలిచింది.
హీరోగా మాత్రమే కాకుండా తొలిసారి మెగాఫోన్ పట్టిన కిరణ్ అబ్బవరం.. దర్శకుడిగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. సీనియర్ స్టార్ హీరోల సినిమాలతో పాటు ‘రియాలిటీ’ కూడా ఒకే సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో టాలీవుడ్‌లో క్రిస్మస్ రిలీజ్‌లపై ఆసక్తి మరింత పెరిగింది.
