
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
గాయం నుంచి కోలుకున్న బాలయ్య
ఇటీవల కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతున్న ‘దాదా’ షూటింగ్లో బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. మోకాలికి గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్న బాలయ్య ప్రస్తుతం పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
మైసూర్ షెడ్యూల్లో భారీ యాక్షన్
‘దాదా’ తాజా షెడ్యూల్ మైసూర్లో సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమైంది. బాలకృష్ణ లేని సమయంలో ఇతర కీలక నటీనటులతో దర్శకుడు గోపీచంద్ మలినేని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా బాలయ్య కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నారు.
ఈ షెడ్యూల్లో బాలకృష్ణపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు కథలో కీలకంగా నిలిచే డ్రామా సీన్లను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
క్రిస్మస్ బరిలో ‘దాదా’
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయించారు. బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ యాక్షన్ సీన్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
