
‘ఇరుముడి’ విజయంతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్న ఆయన.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. విభిన్నమైన కథలను తనదైన శైలిలో తెరకెక్కించే వివేక్ ఆత్రేయ.. రవితేజ సినిమాను కూడా భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపికపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజ సరసన ప్రియాంక అరుళ్ మోహన్?
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజకు జోడీగా గ్లామరస్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించనున్నట్లు టాక్. మరోవైపు మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర రాజన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లు తెరపైకి రావడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
విలన్‌గా జేడీ చక్రవర్తి?
ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఎంపిక ఖరారైతే రవితేజ, జేడీ చక్రవర్తి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. విజయదశమి సందర్భంగా సినిమాను అధికారికంగా ప్రారంభించి, ఆ తర్వాత పూర్తి నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘తులాభారం’ టైటిల్?
ఇక ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టైటిల్‌తో పాటు కాస్టింగ్‌కు సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
‘ఇరుముడి’ తర్వాత రవితేజ చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండటంతో.. సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
