
ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ బాధ్యతలను విస్మరిస్తే ఇకపై జీతంలో కోత తప్పదని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధించనున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అలాగే వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి పోషణకు ఆర్థిక సహాయం అందించని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10 శాతం కోత విధించనున్నట్లు వెల్లడించారు. ఇలా కోత విధించిన మొత్తాన్ని బాధితులైన భార్య లేదా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కుటుంబ బాధ్యతలను విస్మరించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈ నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధమనే విషయం తెలిసినా.. కొందరు మాత్రం ఈ నిబంధనలను పట్టించుకోకుండా బహుభార్యత్వానికి పాల్పడుతున్నారు. మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత విషయం బయటపడినప్పుడు కుటుంబాల్లో తీవ్ర వివాదాలు తలెత్తుతున్నాయి.
రెండో భార్యను ఇంటికి తీసుకురావడంతో మొదటి భార్యలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోతుండగా.. మరికొందరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇష్టంలేకపోయినా అదే కుటుంబంలో కొనసాగుతున్నారు.
ఇలాంటి కుటుంబ సమస్యలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బహుభార్యత్వాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహుభార్యత్వాన్ని అరికట్టే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇలాంటి ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి గణనీయమైన మొత్తాన్ని కోత విధించనున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించారు.
అంతేకాదు.. చిన్నప్పటి నుంచి తమను కంటికి రెప్పలా కాపాడి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఉద్యోగం వచ్చి స్థిరపడిన తర్వాత పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపైనా చర్యలు తీసుకోనున్నారు. అలాంటి వారి జీతంలోనూ కొంత మొత్తాన్ని కోత విధించనున్నట్లు సీఎం తెలిపారు.
మరి రెండో పెళ్లి చేసుకునే ఉద్యోగులకు ఎంత శాతం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఎంత శాతం జీతం కోత విధించనున్నారు? ఈ మొత్తాన్ని ఎవరికి అందజేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం.

