సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం రైఫిల్స్‌లో 282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడులైంది. ఈ నోటిఫికేషన్‌ను ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ITBP) విడుదల చేసింది. వీటికి ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు

  • మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ కమాండెంట్): 115 పోస్టులు
  • స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్): 162 పోస్టులు
  • సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్ ఇన్ కమాండ్): 5 పోస్టులు

ఈ పోస్టులు మెడిసిన్‌, సర్జరీ, గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్‌, అనస్థీషియా, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ తదితర విభాగాల్లో ఉన్నాయి.

అర్హతలు

మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక 200 మార్కుల ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా జరుగుతుంది.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.

  • సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్: లెవల్-12, రూ.78,000 – రూ.2,09,200
  • స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్: లెవల్-11, రూ.67,700 – రూ.2,08,700
  • మెడికల్ ఆఫీసర్: లెవల్-10, రూ.56,100 – రూ.1,77,500

మెడికల్ రంగంలో అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

By Ramya