అవనిగడ్డ, పల్లె పండుగ-3.0 కార్యక్రమం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరో రూ.3,81,25,000 నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తాజాగా వీబీజీ రాంజీ నిధుల ద్వారా పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వివరించారు. అవనిగడ్డ మండలం మోదుమూడి–అశ్వారావుపాలెం రహదారికి రూ.31 లక్షలు, నాగాయలంక మండలం పర్రచివరలో జడ్పీ రహదారికి రూ.34.50 లక్షలు, వక్కపట్లవారిపాలెం–నంగేగడ్డ రహదారికి రూ.56.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

ఘంటసాల మండలం వీ.రుద్రవరంలో రహదారి నిర్మాణానికి రూ.18.25 లక్షలు, మల్లంపల్లి ఎస్సీ కాలనీలో రహదారికి రూ.56.50 లక్షలు, నాగాయలంక మండలం సొర్లగొంది నుంచి దీనదయాళపురం వరకు రహదారి నిర్మాణానికి రూ.55 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

నాగాయలంక మండలం భావదేవరపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు, మోపిదేవిలో ఎన్‌హెచ్-216 నుంచి ఎంజేపీ పాఠశాల వరకు సీసీ రోడ్డుకు రూ.39 లక్షలు, చల్లపల్లిలో గురుకుల పాఠశాల రహదారి నిర్మాణానికి రూ.41 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.

గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పల్లె పండుగ-3.0 ద్వారా రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *