
iQOO త్వరలో భారత మార్కెట్లో iQOO Z11 5Gను విడుదల చేయనున్నట్లు లీకులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్లో MediaTek Dimensity 7500 Turbo ప్రాసెసర్, 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఫోటోగ్రఫీ కోసం 50MP OIS ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా అందించనున్నట్లు సమాచారం. అలాగే చైనా వెర్షన్లో ఉన్నట్లే 9,020mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా భారత మోడల్లో ఉండొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీ ఇప్పటివరకు అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఆగస్టులో ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని లీకులు సూచిస్తున్నాయి. ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

