టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై కూల్చివేసి, 9/11 తరహా దాడికి పాల్పడేందుకు ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమామీ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

అయితే, ఈ దాడికి సంబంధించిన ప్రణాళికను అల్-హమామీ మూడు నెలల క్రితమే, అంటే జూలైలోనే అమలు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ అప్పట్లో తన ప్లాన్‌ను ఎందుకు విరమించుకున్నాడు? ఇప్పుడు మళ్లీ అదే కుట్రను ఎందుకు అమలు చేయాలని ప్రయత్నించాడు? దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈ సంచలన విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న భయానక ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జడ్ 1073 విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై కూల్చివేసి, 9/11 తరహా ఉగ్రదాడికి పాల్పడేందుకు ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమామీ కుట్ర పన్నినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దర్యాప్తు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

అంతేకాదు, ఈ దాడిని మూడు నెలల క్రితమే.. అంటే జూలైలోనే అమలు చేయాలని హమామీ భావించినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఆ ప్రణాళికను ఎందుకు విరమించుకున్నాడు? మళ్లీ ఇప్పుడు దాడికి పాల్పడేందుకు ఎందుకు ప్రయత్నించాడు? ఈ కుట్ర వెనుక అసలు కారణాలేంటి? దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాండింగ్ క్లియరెన్స్‌తో దాడికి కుట్ర!

ఇజ్రాయెల్‌కు చెందిన హీబ్రూ మీడియా కథనాల ప్రకారం.. విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను హత్య చేసిన అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా సాధారణ ప్రక్రియలోనే ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్ అధికారుల నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకోవాలని హమామీ భావించినట్లు తెలుస్తోంది. అనంతరం చివరి క్షణంలో విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లోని విమానాలు లేదా భవనాలపై నేరుగా ఢీకొట్టాలనేది అతడి ప్రధాన ప్రణాళికగా దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఒకవేళ బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌లో దాడి చేయడం సాధ్యం కాకపోతే.. టెల్ అవీవ్‌లోని ఆకాశహర్మ్యాలను విమానంతో ఢీకొట్టడం లేదా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నట్లు హమామీ దర్యాప్తులో అంగీకరించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

అయితే, అల్-హమామీ తొలుత తన ప్రణాళికను జూలైలోనే అమలు చేయాలని భావించినప్పటికీ.. సిబ్బందిలోని ఓ సభ్యుడితో ఉన్న స్నేహం కారణంగా చివరి నిమిషంలో ఆపరేషన్‌ను వాయిదా వేసినట్లు మరో మీడియా కథనం వెల్లడించింది.

విమానాన్ని 16 వేల అడుగులు కిందకు దించిన హమామీ

విమానం ఇజ్రాయెల్‌కు చేరువవుతున్న సమయంలో.. జోర్డాన్ సరిహద్దు వద్ద ప్రార్థనలు చేసుకుంటానని చెప్పిన హమామీ, ఒక్కసారిగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై రోప్ యాక్స్‌తో దాడి చేసినట్లు సమాచారం.

ఆ తర్వాత విమాన ఇంజిన్లను ఆపివేసి, రడ్డర్లను ముందుకు నెట్టడంతో బోయింగ్ విమానం కేవలం నిమిషం వ్యవధిలోనే దాదాపు 16 వేల అడుగుల మేర కిందికి పడిపోయినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

అయితే తీవ్రంగా రక్తస్రావం అవుతున్నప్పటికీ భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కో-పైలట్‌తో పోరాడుతూనే డిస్ట్రెస్ సిగ్నల్స్ పంపడంతో పాటు కాక్‌పిట్ తలుపులను తెరిచారు. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరుకుని హమామీని అదుపులోకి తీసుకోగలిగారు.

ఆ తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని అదుపులోకి తీసుకుని, విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు కథనాలు వెల్లడించాయి.