
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు లక్నోలోని ఏకానా స్టేడియంలో తొలి టీ20 జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్.. టీ20ల్లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది.
తుది జట్టుపై కెప్టెన్, కోచ్‌దే నిర్ణయం
తొలి టీ20కి ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడారు. జట్టు కూర్పుపై కెప్టెన్, హెడ్ కోచ్ కలిసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. భవిష్యత్ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే విషయంలో రొటేషన్ విధానం ఉండొచ్చని మోర్కెల్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచకప్‌లో భారత్ విజయమే ప్రధాన లక్ష్యమని, అందుకు సరైన జట్టు కూర్పును సిద్ధం చేయడంపైనే టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టిందని చెప్పారు.
వైభవ్ ప్రతిభపై మోర్కెల్ ప్రశంసలు
వైభవ్ సూర్యవంశీ గురించి మోర్కెల్ ప్రత్యేకంగా స్పందించారు. అతడిలో ఉన్న ప్రతిభ గురించి టీమ్ మేనేజ్మెంట్కు పూర్తిగా తెలుసని చెప్పారు. సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఎక్కువ సమయం గడపడం యువ క్రికెటర్‌కు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
తుది జట్టులో అవకాశం వచ్చినా, రాకపోయినా వైభవ్‌కు టీమ్‌తో కలిసి ఉండటం మంచి అనుభవంగా మారుతుందని మోర్కెల్ వివరించారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లతో మాట్లాడటం, వారి ఆటతీరును దగ్గరగా గమనించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెప్పారు.
సీనియర్లను గమనించాలి
సీనియర్ ఆటగాళ్లు తమ ఇన్నింగ్స్‌ను ఎలా ప్రారంభిస్తారు? తొలి 15 బంతులను ఎలా ఎదుర్కొంటారు? మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వ్యూహాలు మార్చుకుంటారు? వంటి అంశాలను యువ ఆటగాళ్లు గమనించాలని మోర్కెల్ సూచించారు.
అవకాశాలు ఎక్కువగా వచ్చినా, పరిమితంగా వచ్చినా యువ ఆటగాళ్లు ప్రతి సందర్భం నుంచి నేర్చుకునేలా చేయడం టీమ్ మేనేజ్మెంట్ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రశ్నలు అడుగుతూ సీనియర్ల అనుభవం నుంచి నేర్చుకోవడం వైభవ్ క్రికెట్ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
దీంతో లక్నోలో వెస్టిండీస్‌తో జరిగే తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడా? లేక బెంచ్‌కే పరిమితమవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా.. టీమిండియా సీనియర్లతో కలిసి గడిపే సమయం అతడి భవిష్యత్ క్రికెట్‌కు ఎంతో ఉపయోగపడనుంది.
