
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ క్రాష్ యాక్స్‌తో జరిపిన దాడిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన పుర్రెకు పగుళ్లు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో సౌదీ అరేబియాలోని వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. దెబ్బతిన్న పుర్రె భాగాన్ని విజయవంతంగా పునర్నిర్మించినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను సౌదీ అరేబియా నుంచి అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని గగనతలంలో కూల్చివేసేందుకు ఒమన్‌కు చెందిన కోపైలట్ జరిపిన దాడి గురించి తెలిసిందే. ఈ ఘటనలో విమాన కెప్టెన్‌గా ఉన్న 38 ఏళ్ల భారతీయుడు స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన ఆయనను ప్రపంచవ్యాప్తంగా రియల్ హీరోగా కొనియాడుతున్నారు. అయితే ఈ దాడిలో ఆయన పుర్రెకు పగుళ్లు వచ్చినట్లు వెలువడిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కోపైలట్ ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేయడంతో కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆయన పుర్రెలోని ఓ ఎముక విరిగి లోపలికి దిగబడినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మెదడుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడే ప్రమాదం తలెత్తిందని చెప్పారు. అంతేకాకుండా చేతులు, ఛాతీ, పొత్తికడుపు భాగాల్లోనూ ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. సౌదీ అరేబియాలోని వైద్యులు దెబ్బతిన్న పుర్రె భాగానికి శస్త్రచికిత్స చేసి పునర్నిర్మించినట్లు వెల్లడించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను సౌదీ అరేబియా నుంచి అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు.
ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. చికిత్సకు ఆయన శరీరం సానుకూలంగా స్పందిస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఆసుపత్రిలో కెప్టెన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు.
‘నన్ను నేను కాపాడుకుంటూనే.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడా’
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాల్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆ భయానక ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర గాయాలతో కాక్‌పిట్‌లో కిందపడిపోయినప్పటికీ దాడి కొనసాగుతూనే ఉందని ఆయన వివరించారు. అదే సమయంలో విమానం కిందకు పడిపోతున్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. చివరి ప్రయత్నంగా తన శక్తినంతా కూడగట్టుకుని కాక్‌పిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించానని తెలిపారు.
తన ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనూ విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని కెప్టెన్ మచ్చర్ ప్రధానికి వివరించినట్లు సమాచారం. ప్రయాణికులను రక్షించేందుకు ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
