
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై ట్రూఅప్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడనుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు మొదటి నెలలో వినియోగించే ప్రతి యూనిట్‌కు 30 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఈ అదనపు ఛార్జీని యూనిట్‌కు 50 పైసలకు పెంచనున్నారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) పరిధిలో 29 నెలల పాటు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ ట్రూఅప్ ఛార్జీల వసూలు ప్రక్రియ కొనసాగనుంది. దీంతో వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులపై రానున్న నెలల్లో అదనపు ఆర్థిక భారం పడనుంది.
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. వచ్చే నెల నుంచి విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జీలు కలపనున్నారు. గత ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోళ్లకు అయిన అదనపు వ్యయం, ఆదాయ లోటును సర్దుబాటు చేసుకునేందుకు రూ.5,420.23 కోట్ల ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) డిస్కంలకు అనుమతి ఇచ్చింది.
ఈ ఛార్జీలను నవంబర్ నుంచి జారీ చేసే విద్యుత్ బిల్లుల్లోనే వసూలు చేయాలని కమిషన్ ఆదేశించింది. తొలి నెలలో వినియోగించే ప్రతి యూనిట్‌కు 30 పైసలు అదనంగా వసూలు చేయనుండగా.. డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ట్రూఅప్ ఛార్జీ విధించనున్నారు.
అయితే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ అదనపు భారాన్ని మోపకూడదని టీజీఈఆర్సీ స్పష్టం చేసింది. రైతులకు సంబంధించిన ట్రూఅప్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.
డిస్కంల ప్రతిపాదనలపై విచారణ అనంతరం నిర్ణయం
విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన అనంతరం టీజీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలుకు అయిన అదనపు వ్యయం, 2023-24లో ఏర్పడిన ఆదాయ లోటును కలిపి మొత్తం రూ.7,635.22 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలు అనుమతి కోరాయి.
ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కమిషన్.. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను మినహాయించింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి ట్రూఅప్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించింది. దీంతో నవంబర్ నుంచి విద్యుత్ వినియోగదారుల నెలవారీ బిల్లుల్లో అదనపు ఛార్జీలు చేరనున్నాయి.
విద్యుత్ వినియోగదారులపై ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా మోపనున్నారు. నవంబర్‌లో జారీ చేసే విద్యుత్ బిల్లులో యూనిట్‌కు 30 పైసల చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. డిసెంబర్ నుంచి జారీ చేసే బిల్లుల్లో యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీ విధించనున్నారు. ఈ వసూళ్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో 26 నెలల పాటు కొనసాగనున్నాయి.
ట్రూఅప్ ఛార్జీల కింద విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతించిన మొత్తంలో దక్షిణ తెలంగాణ డిస్కం వాటా రూ.5,665.42 కోట్లు కాగా, ఉత్తర తెలంగాణ డిస్కం వాటా రూ.1,969.80 కోట్లుగా ఉంది. అయితే ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన మొత్తాన్ని మినహాయించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని నిర్ణీత కాలపరిమితిలో వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్ల నుంచి వసూలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి.
వ్యవసాయ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఈఆర్సీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని డిస్కంలను ఆదేశించింది. ఇందులో దక్షిణ తెలంగాణ డిస్కం పరిధికి రూ.1,442.49 కోట్లు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధికి రూ.772.50 కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల నుంచి ఈ ట్రూఅప్ ఛార్జీలను నేరుగా వసూలు చేయరాదని ఈఆర్సీ స్పష్టం చేసింది. రైతులపై అదనపు ఆర్థిక భారం పడకుండా, వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కంలు రాబట్టుకోవాలని సూచించింది.
