
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను చూసేందుకు వెంకీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్‌కు అనుగుణంగా ప్రమోషన్స్ కూడా నిర్వహించాలని భావించారు. అయితే సినిమా పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
రీ-రికార్డింగ్‌పై రూమర్లకు చెక్
ఇక ‘ఆదర్శ కుటుంబం’ రీ-రికార్డింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలకు చిత్ర నిర్మాతలు చెక్ పెట్టారు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వెల్లడిస్తూ చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం ‘జెట్ స్పీడ్’లో సినిమా RR వర్క్‌ను పూర్తి చేస్తున్నారని మేకర్స్ తెలిపారు.
తమన్పైనే పూర్తి బాధ్యత
దీంతో ‘ఆదర్శ కుటుంబం’కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ బాధ్యతలను తమనే నిర్వహిస్తున్నట్లు స్పష్టమైంది. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ పేరు కేవలం ప్రచారానికే పరిమితమైందని తేలిపోయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తమన్ అందించే RR సినిమాకు మరింత బలం చేకూర్చనుందని చిత్రబృందం భావిస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ఇప్పటికే ఆసక్తి పెరిగిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
