రాజకీయంగా ప్రత్యర్థులైనా వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా మెలగడం అరుదుగా కనిపిస్తుంటుంది. పార్టీల మధ్య ఎంతటి వైరుధ్యాలు ఉన్నా ఎన్నికల వేళ పరస్పరం గౌరవించుకోవచ్చని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ, వైసీపీ నేతలు చాటిచెప్పారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శనివారం చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.

మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు, వైసీపీ అభ్యర్థి జింకా వెంకటాచలపతి ఒకే సమయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎన్నికల్లో ఎవరి రాజకీయ పోరాటం వారు కొనసాగించినప్పటికీ వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా వ్యవహరించడం ఈ ఘటనలో ప్రత్యేకతగా నిలిచింది. ఎన్నికలు ఉద్రిక్తతలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించుకోవాలని ఇరువురు అభ్యర్థులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాజకీయ ప్రత్యర్థుల మధ్య సాధారణంగా కనిపించే వాగ్వాదాలు విమర్శలకు భిన్నంగా మదనపల్లెలో చోటుచేసుకున్న ఈ స్నేహపూర్వక సన్నివేశం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో పోటీ ఉన్నా పరస్పర గౌరవం స్నేహభావానికి చోటు ఉంటుందని ఈ ఘటన గుర్తుచేసింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *