
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పండగ సీజన్లో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా మార్కెట్ ధరల ప్రకారం బంగారం ధరలు గణనీయంగా దిగివచ్చాయి.
గ్రాముపై రూ.170 తగ్గిన బంగారం
24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.170 తగ్గి రూ.14,438కు చేరింది. 22 క్యారట్ల బంగారం ధర రూ.155 తగ్గి రూ.13,235గా, 18 క్యారట్ల బంగారం ధర రూ.127 తగ్గి రూ.10,829గా నమోదైంది. వెండి ధర మాత్రం కిలోకు రూ.2,25,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలివే!
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,44,380గా, 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,350గా ఉంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,08,290కు చేరింది.
చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం ధర రూ.1,44,530గా, 22 క్యారట్ల ధర రూ.1,32,500గా నమోదైంది.
ధరల తగ్గుదల పండగ వేళ కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు. కొనుగోలుకు ముందు స్థానిక దుకాణాల్లో తాజా ధరలను తెలుసుకోవడం మంచిది.
గమనిక: పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనంగా ఉండవచ్చు.
