ధోనీ కాదు డేంజరస్ మ్యాన్ ఎంట్రీ.. సీఎస్కేకి బ్రేక్ వస్తుందా? చెపాక్‌లో చెన్నై-పంజాబ్ పోరు!

Date:

ఐపీఎల్‌లో ఈ రోజు చెపాక్ స్టేడియంలో కీలక పోరు జరగనుంది. బ్రేక్ కోసం చూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది చక్కటి అవకాశం. సీఎస్కే – పంజాబ్ కింగ్స్ మధ్య చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. పంజాబ్ తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా, సీఎస్కే రాజస్థాన్‌పై దారుణంగా ఓడిపోయింది.

ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్ – పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్ మీద ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. హోం గ్రౌండ్‌లో పంజాబ్‌పై జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలని సీఎస్కే చూస్తోంది. కానీ, గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ప్రదర్శనలలో పంజాబ్‌దే పైచేయిగా ఉంది.

కాలి కండరాల గాయంతో సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ధోనీ.. సడెన్‌గా నెట్స్‌లో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చెపాక్‌లో మ్యాచ్ కావడంతో ధోనీ కోసం అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దాంతో మ్యాచ్ ఆడకపోయినా డగౌట్‌లో ధోనీ కనిపించనున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కి డేంజరస్ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్-జీ సమావేశం.. యువత ప్రశ్నలకు ఆలోచింపజేసేలా ‘కూల్ గురు’ సమాధానాలు..!

భయం వెంటాడుతున్నప్పటికీ స్థిరమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? విజయం కోసం జరిగే...

ధోనీ రికార్డు బద్దలు.. విదేశీ టెస్టుల్లో పంత్ సరికొత్త చరిత్ర!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన...

Raw Coconut: పచ్చి కొబ్బరి తినడం మీకు ఇష్టమా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే మనదేశంలో కొబ్బరికాయకు పూజా కార్యక్రమాల్లోనే...

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...