పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్!

Date:

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షల భారీ జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు ఈ మొత్తాన్ని జరిమానాగా విధించారు. దీంతో ప్రస్తుత సీజన్‌లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.

ఐపీఎల్ 2026ను గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ విజయంతో ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‌కు ఐపీఎల్ నిర్వహకులు షాక్ ఇచ్చారు. స్లో ఓవర్ రేటు నమోదు చేసినందుకు గానూ.. ఫైన్ విధించారు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్ అయ్యర్ నమోదు చేసిన తొలి స్లో ఓవర్‌ రేటు నమోదు ఇదే. దీంతో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలో ఆర్టికల్‌ 2.22 నిబంధన ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌ విధించింది.

కాగా ఐపీఎల్ 2026లో బాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్‌ ఏకంగా నాలుగు వైడ్లు వేశాడు. దానికి అదనంగా ఒక నోబాల్ కూడా వేశాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తంగా 11 బంతులు విసిరాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ నిర్ణత సమయంలోగా 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైంది. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఫలితంగా ఐపీఎల్ 2026లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా శ్రేయస్ నిలిచాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...