ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

Date:

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించింది. రిలయన్స్ రూ.1,08,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.19 వేల కోట్ల వరకూ రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు డేటా సెంటర్‌కు భూమిని కేటాయించేందుకు అనుమతించారు. అలాగే భారీగా రాయితీలు కల్పించేందుకు ఓకే చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులతో వస్తున్న కంపెనీలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,08,010 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్, గిగా స్కేల్‌ ఏఐ డేటా సెంటర్‌కు ప్రభుత్వం దాదాపు రూ.19వేల కోట్ల వరకు భారీగా ప్రోత్సాహకాలను అందించింది. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్‌ కోసం 854.97 ఎకరాలను 25 శాతం తగ్గింపు ధరతో కేటాయించేందుకు అనుమతించారు. రిలయన్స్‌కు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు చెల్లించేందుకు టైలర్‌మేడ్‌ విధానంలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

రిలయన్స్‌ సంస్థకు స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. యంత్రాలు, పరికరాలకు సంబంధించిన ఖర్చులో 6 శాతం పెట్టుబడి రాయితీ (రూ.4,500 కోట్లను 10 వాయిదాల్లో చెల్లిస్తారు). రిలయన్స్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి చేసే ఖర్చుపై స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు.. గరిష్ఠంగా 10 ఏళ్లలో రూ.2,527.38 కోట్లను చెల్లిస్తారు. లీజ్‌కు సంబంధించి 10 ఏళ్ల పాటూ స్టేట్ జీఎస్టీ గరిష్టంగా రూ.1800 కోట్లు మినహాయింపు ఇచ్చారు. నీటి టారిఫ్‌లో 15 శాతం రాయితీ (10 ఏళ్లలో రూ.552.41 కోట్లు).. ఏపీజీడబ్ల్యూ ఫైబర్‌ యాక్సెస్‌ కాస్ట్‌లో 20 ఏళ్ల పాటూ 30శాతం రాయితీ (రూ.1,220.71కోట్లు) ఇచ్చారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...

ఏపీలోని గ్రామాల్లో కొత్త సర్వే.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు....