సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

Date:

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. నీట్ పేపర్ లీక్‌పై నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన ఆయనకు టైఫాయిడ్ వచ్చింది. తనకు టైఫాయిడ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా అభిజీత్ దీప్కే వెల్లడించారు. తనకు టైఫాయిడ్ వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల వైద్య పరీక్షలు చేయించగా వ్యాధి నిర్ధారణ అయినట్లు చెప్పారు.

ప్రస్తుతం రోజుకు రెండుసార్లు ఇంట్రావీనస్ (IV) చికిత్స తీసుకుంటున్నట్లు దీప్కే పేర్కొన్నారు. తాను అనారోగ్యానికి గురైనా విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరుతూ చేపట్టిన నిరసన దీక్ష మాత్రం కొనసాగుతుందని చెప్పారు. అలాగే, నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని అభిజీత్ తన వీడియో సందేశంలో తేల్చి చెప్పారు. మరోవైపు, దీప్కేతో పాటు పలువురు సీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

‘అందరికీ నమస్కారం. కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని మీ అందరికీ తెలుసు. అందుకే రక్త పరీక్షలు చేయించాను. రిపోర్టుల్లో టైఫాయిడ్ అని నిర్ధారణ అయింది. చికిత్స కొనసాగుతోంది. నాకు ప్రతి ఉదయం, సాయంత్రం ఐవీ డ్రిప్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బొద్దింకలందరికీ నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా.

మీ వల్లే ఈ ఉద్యమం ఇంత విజయవంతమైంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఉద్యమాన్ని ఇంత పెద్ద విజయంగా మార్చినందుకు మీ అందరికీ అభినందనలు. నీట్ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ చేపట్టిన ఉద్యమం కొనసాగుతుంది’ అని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...