బాల్య స్నేహితుడ్ని తిరిగి హిందూమతంలోకి మార్చిన భూమన.. ‘అన్యమత’ ఆరోపణలకు వైసీపీ నేత చెక్.

Date:

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో ముస్లిం మతం స్వీకరించిన దంపతులు తిరిగి హిందూ మ‌తాన్ని స్వీక‌రించారు. తిరుప‌తికి చెందిన అబ్దుల్లా, అమీనా దంప‌తుల‌ు వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య హిందూ మ‌తంలోకి మారారు. వీరిద్దరు 30 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లారు.. అక్కడ ముస్లిం మతంలోకి మారారు. తాజాగా తిరుపతికి తిరిగొచ్చిన దంపతులు భూమన సమక్షంలో మళ్లీ హిందూమతం స్వీకరించారు.

తిరుపతిలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసంలో హిందూమత పున:స్వీకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి పీకే లే అవుట్‌కు చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. ఈ జంటను ఆహ్వానిస్తూ ప్రత్యేక హోమం నిర్వహించగా.. ఈ ఇద్దరు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతి పీకే లే అవుట్ కాలనీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు 30 ఏళ్ల కిందట జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడి పరిస్థితుల కోసం నాడు ఇస్లాం మతం స్వీకరించారు.. అయితే 5 ఏళ్ల కిందట వీరు తమ స్వస్థలానికి తిరిగొచ్చారు.

శ్రీనివాసులు రెడ్డి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు చిన్ననాటి క్లాస్‌మెట్ కాగా.. కువైట్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కొన్ని రోజులకు తిరుపతిలో ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి ముస్లింగా మారి అబ్బుల్లాగా పేరు మార్చుకున్నట్లు భూమనకు తెలిసింది. ఆ విషయం తెలిసిన నాటి నుంచి.. ఎందుకిలా చేశారు, తిరిగి హిందూ మతంలోకి రావాలని కోరారు. ముఖ్యంగా ఏడాది కాలంగా పదే పదే చెప్పడంతో అబ్దుల్లా, అమీనా దంపతులు బాగా ఆలోచించి.. తిరిగి హిందూ మతంలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. హిందూ మతంలోకి రావడానికి నిర్ణయించుకున్న ఈ దంపతులు.. ఆ కార్యక్రమం కోసం భూమనను ఆశ్రయించారు. దీంతో భూమన.. పద్మావతిపురంలోని తన స్వగృహంలో ‘హిందూ పున:స్వీకరణ మహోత్సవం’ ఏర్పాటు చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు..

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ...

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి...

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు...

ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్..

ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో,...