రామాయణ’ టీజర్‌ రిలీజ్‌.. శ్రీరాముడి అవతార్‌లో ఆకట్టుకున్న రణబీర్‌ కపూర్

Date:

నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ‘రామాయణ’ టీజర్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ లుక్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సుమారు 4000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. సాయి పల్లవి, యష్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ పౌరాణిక గాథపై ఈ టీజర్ అంచనాలను రెట్టింపు చేస్తోంది.

రామాయణ ం ఇతిహాసం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ అనే టైటిల్ తో నమిత్ మల్హోత్రా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రావణుడిగా యష్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ అలరించగా.. నేడు హనుమాన్‌ జయంతి సందర్భంగా ‘రామ’ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

పట్టాభిషేకం, అరణ్యవాసం వంటి ఘట్టాలతో రూపొందించిన ‘రామ’ వీడియో అద్భుతంగా ఉంది. 2 నిమిషాల 38 సెకండ్ల వీడియోతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందని శాంపిల్ గా చూపించారు. మర్యాద పురుషోత్తముడుగా శ్రీరాముడి అవతార్ లో రణబీర్‌ కపూర్ ఆకట్టుకున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, వీఎఫ్ఎక్స్‌ ఈ టీజర్‌కు హైలైట్‌ గా నిలిచాయి. సీత, రావణుడి పాత్రలను ఈ వీడియోలో చూపించలేదు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...