మైథలాజికల్ టచ్‌తో ‘కురుక్షేత్రం’… నాని డైరెక్టర్‌తో బాలయ్య సరికొత్త ప్రయోగం?

Date:

నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ మూవీని విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం మైథాలజికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టాక్. గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘శ్రీ రామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, చారిత్రక పాత్రల్లో మెప్పించిన బాలయ్యకు, వివేక్ ఆత్రేయ సరికొత్త నెరేటివ్‌ను సిద్ధం చేశారు.

నందమూరి బాలకృష్ణ .. ఈ పేరు వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. వరుస విజయాల జోరులో ఉన్న బాలయ్య, తన తదుపరి చిత్రాల విషయంలో రూట్ మారుస్తున్నారు. ఒకవైపు గతంలో తనకు హిట్లు ఇచ్చిన దర్శకులతో మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే, మరోవైపు యంగ్ దర్శకులతో విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయబోయే సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ వంటి విలక్షణమైన కథలతో వివేక్ ఆత్రేయ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడు మాస్ గాడ్ బాలయ్యతో జతకట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరు వినగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథాలజికల్ టచ్ ఉన్న కథా? అనే చర్చ నడుస్తోంది. బాలయ్యకు పౌరాణిక, చారిత్రక పాత్రలు పోషించడంలో సాటిలేని అనుభవం ఉంది. గతంలో ఆయన ‘శ్రీ రామ రాజ్యం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ మార్క్ విభిన్న కథనానికి, బాలయ్య మార్క్ గంభీరమైన డైలాగ్ డెలివరీ తోడైతే, వెండితెరపై మరో అద్భుతం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...