తేయాకులు కోసి, సెల్ఫీ తీసుకుంటూ.. టీ తోటలో చిరస్మరణీయ అనుభూతిని పొందిన ప్రధాని మోదీ

Date:

అస్సాం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శైలిలో కనిపించారు. దిబ్రుగఢ్‌లోని ఒక తేయాకు తోటలో కార్మికులను ప్రధాని మోదీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి మహిళలతో ముచ్చటించారు. వారితో కలిసి తేయాకు ఆకులు కోశారు. మహిళా కూలీల కోరిక మేరకు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. తేయాకు కార్మికుల కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్రధాని మోదీకి సంబంధించిన తేయాకు తోటల ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తన అనుభవాన్ని పంచుకుంటూ, ప్రధానమంత్రి తేయాకును అస్సాం ఆత్మగా అభివర్ణించారు. రాష్ట్ర తేయాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ ఉదయం దిబ్రుగఢ్‌లో ఒక టీ తోటను సందర్శించి, ఈ పర్యటనను చిరస్మరణీయ అనుభవంగా అభివర్ణిస్తూ, ప్రధాని మోదీ తేయాకు పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న కార్మికులతో ముచ్చటించి, వారి కృషిని అభినందించారు.

“ప్రతి తేయాకు తోట కుటుంబం చేసిన కృషికి మేము చాలా గర్వపడుతున్నాము. వారి కఠోర శ్రమ, పట్టుదల అస్సాం గౌరవాన్ని పెంచాయి,” అని ఆయన మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పర్యటన ఫోటోలను పంచుకుంటూ, ప్రధాని మోదీ, “తేయాకు కోయడం అనంతరం మహిళలు తమ సంస్కృతి గురించి మాట్లాడారు, ఆపై ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు!” అని పేర్కొన్నారు.

తేయాకు కోసిన తర్వాత, అక్కడి మహిళలు వారి సంస్కృతి గురించి వివరించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనతో ఎంతో సంతోషంగా సెల్ఫీ కూడా తీసుకున్నారని ప్రధాని మోదీ రాశారు. తేయాకు తోటల కుటుంబాలందరి కృషికి మేము చాలా గర్వపడుతున్నాము. వారి కఠోర శ్రమ, అంకితభావం అస్సాం కీర్తిని మరింత పెంచాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...