పచ్చిమిర్చి తొందరగా పాడవుతున్నాయా? నెల రోజులైనా ఫ్రెష్‌ ఉండాలంటే పాటించాల్సిన సింపుల్‌ చిట్కాలు

Date:

పచ్చిమిర్చి లేనిదే మన వంట పూర్తికాదు. పచ్చిమిర్చి మన వంటకు రుచిని, కారాన్ని ఇస్తుంది. అయితే పచ్చిమిర్చిని నిల్వ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నాలుగు లేదా ఐదు రోజులకే రంగు మారడం, మెత్తబడి పాడైపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల డబ్బు వృధా కావడమే కాకుండా వంటల్లో వేసినప్పుడు రుచి కూడా తగ్గుతుంది. మీ ఇంట్లో ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే సుమారు 15 నుంచి నెల రోజుల పాటు పచ్చిమిర్చి చక్కగా నిల్వ ఉండాలంటే పాటించాల్సిన టెక్నిక్స్‌ ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తొడిమెలు తీసేయడం చాలా కీలకం. పచ్చిమిర్చికి ఉండే తొడిమెలో ఎక్కువ తేమ నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చి కుళ్లిపోవడం లేదా చెడిపోవడం అనేది తొడిమ నుంచే ప్రారంభమవుతుంది. అంతే కాకుండా తొడిమల వద్ద ఉండే తేమ వల్ల బూజు లేదా బ్యాక్టీరియా తొందరగా అక్కడ చేరుతాయి. తొడిమ తీసేయడం వల్ల బూజు లేదా బ్యాక్టీరియా మిర్చిలోపలికి ప్రవేశించడం కష్టం. అయితే తొడిమ తీసేసిన తర్వాత మిర్చిని కడిగితే ఆ రంధ్రం ద్వారా నీళ్లు లోపలికి పోయి మిర్చి తొందరగా పాడవుతుంది. కాబట్టి మిర్చిని బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత తొడిమలు తీసేసి నిల్వ ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

పచ్చిమిర్చిని నిల్వ చేసే ముందు శుభ్రంగా కడగాలి. మిర్చి శుభ్రం చేయడంతో పాటు తేమ లేకుండా ఆరబెట్టడం కూడా ముఖ్యం. మిర్చి సరిగా ఆరకుండా నీటి చుక్కలు ఉంటే అవి తొందరగా మిర్చిని బూజు పట్టేలా చేస్తాయి. కాబట్టి మిర్చి బాగా కడిగిన తర్వాత ఒక జల్లెడ లేదా చిల్లుల గిన్నెలో వేసి నీరు ఒడిసి పోయేలా చేయాలి. అనంతరం ఒక క్లాత్‌పై పోసి బాగా గాలికి ఆరనివ్వాలి. అనంతం ప్యాక్‌ చేసి నిల్వ ఉంచుకోవాలి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Vice President C.P. రాధాకృష్ణన్ గారి ప్రసంగం: భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ ఆవిష్కరణ”

https://www.youtube.com/watch?v=BPPUSuTEhyE భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పీ. రాధాకృష్ణన్ గారు భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్...

Brain Health: పిల్లల నుంచి పెద్దల వరకు.. వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

వాల్‌నట్స్‌.. మెదడు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయి? మన శరీరానికి అవసరమైన పలు...

నీరసం దూరం చేసి బలాన్నిచ్చే సూపర్‌ఫుడ్.. ఇలా చేస్తే నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్‌ఫాస్ట్!

ఉదయం పూట రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండాలంటే పోషకాలు ఉన్న అల్పాహారం...

యశ్‌పై దిల్ రాజు నమ్మకం.. ‘టాక్సిక్’కు రూ.120 కోట్ల బిగ్ డీల్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక...