IND vs IRE: ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని ‘3 టీంలు’.. లిస్ట్‌లో 2వ పేరు షాకింగ్ భయ్యో..!

Date:

ICC Full Members undefeated against Ireland: క్రికెట్‌లో పసికూనగా భావించే ఐర్లాండ్ జట్టు అగ్రశ్రేణి జట్లకు ఎప్పుడూ ముప్పుగానే పరిణమించింది. జూన్ 26న భారత్‌కు షాక్ ఇచ్చిన ఐర్లాండ్.. గతంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ వంటి దిగ్గజ జట్లను కూడా ఓడించింది. కానీ ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు మాత్రం తమ వ్యూహాలతో, అనుభవంతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోకుండా తమ రికార్డును పదిలంగా ఉంచుకున్నాయి. భవిష్యత్తులో ఈ జట్ల అజేయ రికార్డును ఐర్లాండ్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

ICC Full Members undefeated against Ireland: టీ20 ప్రపంచకప్ 2026 చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఐర్లాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా తొలి టీ20లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన ఎనిమిదో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్ నిలిచింది. అయితే ప్రపంచ క్రికెట్‌లో ఐర్లాండ్ జేత్రయాత్రకు లొంగని మూడు బలమైన జట్లు ఇంకా ఉన్నాయి.

ఐర్లాండ్ గుప్పిట్లోకి చిక్కని ఆసీస్..

ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాలుగా ఏలుతున్న ఆస్ట్రేలియా జట్టును వన్డే, టీ20 ఫార్మాట్లలో లొంగదీసుకోవడం ఐర్లాండ్‌కు ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్ ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ కంగారూలు ఏకపక్ష విజయాలు నమోదు చేసినప్పటికీ, 2015 ఆగస్టులో జరిగిన వన్డే మ్యాచ్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు గుర్తిండిపోతుంది.

ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 222 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 84 పరుగులతో రాణించాడు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు ఎడ్ జాయిస్, నియాల్ ఓబ్రెయిన్ అద్భుత పోరాటంతో ఆసీస్‌ను భయపెట్టారు. అయితే నాథన్ కౌల్టర్-నైల్ మూడు వికెట్లతో విరుచుకుపడగా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ప్రత్యర్థిని కట్టడి చేశారు. చివరికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి తన అజేయ రికార్డును కాపాడుకుంది.

లంకను వణికించినా దక్కని విజయం..

ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా కంటే లంక జట్టు మరింత మెరుగైన రికార్డును కలిగి ఉంది. విభిన్న ఫార్మాట్లలో ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్‌ల్లోనూ శ్రీలంకనే విజయం వరించింది. అయితే 2009 లార్డ్స్ మైదానంలో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐర్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. మహేల జయవర్ధనే 78 పరుగులతో రాణించడంతో శ్రీలంక 144 పరుగులు చేసింది.

ఐర్లాండ్ బౌలర్ అలెక్స్ కుసాక్ నాలుగు వికెట్లతో లంక బ్యాటింగ్‌ లైన్‌అప్‌ను దెబ్బతీశాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్లు మంచి పునాది వేశారు. జాన్ మూనీ ఆఖరి వరకు క్రీజులో ఉన్నా లోయర్ మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో ఐర్లాండ్ గెలవలేకపోయింది. లసిత్ మలింగ, అజంతా మెండిస్, ముత్తయ్య మురళీధరన్ లతో కూడిన లంక స్పిన్, పేస్ త్రయం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 9 పరుగుల తేడాతో గట్టెక్కింది.

కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐరిష్ పోరాటం..

న్యూజిలాండ్ జట్టు ఐర్లాండ్‌పై ఆడిన 13 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ కివీస్ జట్టుకు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఒక వికెట్ తేడాతో, మూడు వికెట్ల తేడాతో, కేవలం ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.

ముఖ్యంగా 2022 జూలై 15న డబ్లిన్‌లో జరిగిన వన్డే మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మార్టిన్ గప్టిల్ (115), హెన్రీ నికోల్స్ (79) సెంచరీ, హాఫ్ సెంచరీలతో 360 పరుగుల భారీ స్కోరు సాధించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఐరిష్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (120), హ్యారీ టెక్టర్ (108) అద్భుత శతకాలతో న్యూజిలాండ్ బౌలర్లపై దండయాత్ర చేశారు.

మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీసినా ఐర్లాండ్ పోరాటాన్ని ఆపలేకపోయాడు. చివరి ఓవర్లో ఐర్లాండ్ విజయానికి 10 పరుగులు కావాలి. బ్లెయిర్ టిక్నర్ విసిరిన ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఐర్లాండ్ వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. అద్భుతమైన స్కీమ్‌..!

Post Office Gram Suraksha Scheme: రోజువారీ జీవితంలోని అన్ని ఖర్చులను...

చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రకృతి వైపరీత్యమైనా,...

కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో...

ఈ ఆస్పత్రిలో పేద ప్రజలే వీఐపీలు.. ఓపీ కేవలం రూ.30 మాత్రమే.. టెస్టుల కూడా చాలా చీప్..

వరుణ్ హెల్త్ సెంటర్, విజయవాడలో కేవలం రూ.30కే కన్సల్టేషన్ ఫీజుతో నాణ్యమైన...