చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

Date:

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రకృతి వైపరీత్యమైనా, సాంకేతిక లోపమైనా, ఎదుటివారి నిర్లక్ష్యమైనా.. ఒక్క క్షణంలోనే జీవితాన్ని మార్చేయగలదు. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ సంఘనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. హెల్మెట్‌ లేకపోవడంతో ఓ బైకర్ తలకు చెట్టుకొమ్మ తగిలి అతను కోమాలోకి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ హెల్మెట్ ప్రాణరక్షక కవచం.. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా దాన్ని పెడచెవును పెడతారు.కానీ హెల్మెట్ లేకపోవడం ఎత ప్రమాదమో ఇటీవల బెంగుళూరులోని రాజాజీనగర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మరోసారి గుర్తు చేసింది. క్షణాల్లో జరిగిన ప్రమాదం ఎంతటి విషాదానికి దారి తీస్తుందో చూపించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా సడెన్‌గా దారి పక్కన ఉన్న చెట్టు నుంచి ఓ కొమ్మ విరిగి అతని తలపై పడిపోయింది. అంతే అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతను కోమాలోకి వెళ్లినట్టు నిర్ధారించారు.

కాబట్టి బైక్ డ్రైవింగ్ చేసేప్పుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. నాణ్యమైన ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌ను సరిగా ధరించడం వల్ల తలకు తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. చిన్న దూరమైనా, పెద్ద ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఒక నిమిషం నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగిల్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే… హెల్మెట్ అనేది పోలీసుల జరిమానా నుంచి తప్పించుకునేందుకు కాదు.. మీ కుటుంబం కోసం మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి. మీ కోసం ఎదురుచూస్తున్న వారి ఆనందాన్ని కాపాడటానికి. కాబట్టి ప్రతి ప్రయాణంలో హెల్మెట్‌ను అలవాటుగా మార్చుకుంటేనే ప్రమాదాల తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...