ఏపీ స్టేట్స్ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు సోమవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల విభాగాల్లో సుమారు 800 మంది క్రీడాకారులు పోటీపడ్డారు.

ఈ సందర్భంగా డీఈవో బ్రహ్మాజీ, డాక్టర్ సి.ఎల్. నాయుడు విద్యాసంస్థల అధినేత డాక్టర్ సి.ఎల్. నాయుడు మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరూ క్రమశిక్షణతో తమ ప్రతిభను ప్రదర్శించారని ప్రశంసించారు. కోచ్‌లు, మేనేజర్లు సమర్థంగా పర్యవేక్షించడంతో రాష్ట్రస్థాయి ఎంపికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు.

జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో పర్రి కృష్ణమూర్తి, ఎంఈవో సోంబాబు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మజ్జి రామకృష్ణ, స్కూల్ గేమ్స్ సెక్రటరీలు ఆర్. రాములు, దుర్గాదేవి, డీఈవో కార్యాలయ సిబ్బంది రంగాచారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

అలాగే వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు నెల్లి వెంకటరమణ, పుష్పనాథం, ఉమామహేశ్వరరావు, ఎస్.వి. రమణ, సురేష్, రాము, రమణ, ఈశ్వరరావు, హైమ, చినమ్మడు, నిరీక్షణ శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *